ముఖ్యమంత్రి పర్యటన ఆలస్యం

హైదరాబాద్‌: వరద బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటన ఆలస్యంగా ప్రారంభం కానుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వేచి ఉన్నారు. పలు జిల్లాల్లో ముంపుకు గురైన ప్రాంతాల్లో నేడు ముఖ్యమంత్రి ఏరియల్‌ సర్వే చేయనున్నారు.