ముగిసిన టీ ఉద్యోగుల జేఏసీ భేటీ
హైదరాబాద్,(జనంసాక్షి): టీఎన్టీవో భవన్‌లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సమావేశం ముగిసింది. చలో అసెంబ్లీపై ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణలో అప్రకటిత నిర్బంధకాండ కొనసాగుతున్నదని జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వాలని, అనుమతి ఇప్పించాల్సిన బాధ్యత తెలంగాణ మంత్రులదేనని టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. ఉద్యోగులమంతా మరో ఐక్య ఉద్యమానికి సిద్దమౌతామని తెలిపారు. అరెస్టు చేసిన ఎద్యోగులను వెంటనే విడుదల చేయకపోతే అత్యవసర సేవలు బంద్ చేస్తామని శ్రీనివాష్‌గౌడ్ హెచ్చరించారు. చావోరేవో తేల్చుకోవడానికి తెలంగాణ ప్ర.లు సిద్దంగా ఉన్నారని తెలిపారు. సామంత్రంలోపు అరెస్టు చేసిన ఉద్యోగులను విడుదల చేయాలని చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వాలని విఠల్ డిమాండ్ చేశారు. లేకపోతే రేపు ఉదయం సమావేశమై మా కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.