ముగిసిన బాల్‌ఠాక్రే అంత్యక్రియలు
ముబంయి : మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఠాక్రే శకం ముగిసింది. శివసేన అధినేత బాలాసాహెబ్ ఠాక్రే అంత్యక్రియలు ముగిశాయి. ఇక్కడి శివాజీ పార్క్‌లో ఆయనకు మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తి అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. ఠాక్రే పార్థీవ దేహాన్ని చితిపై ఉంచిన అనంతరం పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. ఠాక్రే చితికి ఆయన పెద్ద కుమారుడు నిప్పంటించారు. ఠాక్రే అభిమానులు బాలాసాహెబ్ అమర్హ్రే అంటూ నినాదాలు చేశారు. అంత్యక్రియలకు పలువురు సీనీ, రాజకీయ ప్రముఖుల హాజరయ్యారు.