ముగిసిన మెడికల్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌

రాష్ట్రంలోని నాలుగు ఆన్‌లైన్‌ కేంద్రాల్లో గత వారం రోజులుగా జరుగుతున్న మొదటి విడత కౌన్సెలింగ్‌ శుక్రవారంతో ముగిసింది. కౌన్సెలింగ్‌ ప్రక్రియలో మొత్తం 3668 ఎంబీబీఎస్‌, 862 బీడీఎస్‌ సీట్లు భర్తీ అయినట్లు విజయవాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్టార్‌ డాక్టర్‌ టి. వేణుగోపాలరావు తెలిపారు. మెరిట్‌ ఆర్డర్‌ ప్రకారం 10,0001 నుంచి 20, 000వరకు ఆంధ్రా, ఎస్వీయూ పరిధిలో బీసీఈ, ఎస్టీ అభ్యర్థులకు శుక్రవారం కౌన్సెలింగ్‌ చేపట్టగా హైదరాబాద్‌ జేఎన్‌టీయూ కౌన్సెలింగ్‌ కేంద్రంలో 14మంది ఆంధ్రా విశ్వవిద్యాలయం పరిధిలో 60మంది, ఎస్వీయూ పరిధిలో 41మంది, విజయవాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం 116మంది కలిపి మొత్తం 231మంది అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ఎస్టీ విభాగంలో 18, 669 ర్యాంకు వద్ద సీట్లన్ని భర్తీ కావడంతో ప్రక్రియను ముగించారు.