ముగ్గుల పోటీలో గెలుపొందిన మహిళలకు బహుమతులను అందజేసిన ఎమ్మెల్యే

మల్దకల్ ఆగస్టు 20 (జనంసాక్షి)గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండలం కేంద్రంలోని మండలమహిళ సమాఖ్య భవనం ఆవరణంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల భాగంగాశనివారంముగ్గులపోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమెహన్ రెడ్డి హాజరయ్యారు.స్వతంత్ర భారత వజ్రోత్సవాలు భాగంగా మహిళలు వేసిన ముగ్గులను ఎమ్మెల్యే పరిశీలించడం జరిగినది.ముగ్గుల పోటీలో గెలుపొందిన ప్రధమ,ద్వితీయ,తృతీయ, స్థానాలలో మహిళలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో 15 రోజులపాటు రోజుకు ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
స్వతంత్ర పోరాటంలో ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బ్రిటిష్ వారితో పోరాటం చేసి మన భారతదేశ దేశానికి స్వతంత్రం సాధించడం జరిగింది. వారిని స్మరించుకుంటూ 75 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రం లో కెసిఆర్ నాయకత్వంలో వేడుకలు ఘనంగా జరుపుకున్నామన్నారు.ఈ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ ప్రతి రోజు నిర్వహిస్తూ ప్రజలందరికి భాగస్వామ్యం చేస్తూ ప్రతి ఒక్కరికి దేశం పట్ల బాధ్యత భక్తి కలిగే విధంగా కృషి చేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజారెడ్డి, జెడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి, సింగల్ విండో ఛైర్మన్ తిమ్మారెడ్డి, సర్పంచ్ యాకోబు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సవారన్న, సర్పంచులు,ఎంపీటీసీలు,తెరాస పార్టీ నాయకులు జంబు రామన్ గౌడ్, మధు, పరుశురాముడు, ప్రభాకర్ ,నర్సింహులు, మండలం మహిళ సమాఖ్య అధ్యక్షురాలు, మండలం పార్టీ యూత్ అధ్యక్షుడు ప్రవీణ్,ఎస్సీ సెల్ అధ్యక్షుడు మహేష్ అధికారులు, నాయకులు, కార్యకర్తలు ,యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.