ముత్తాయికోట గ్రామంలో సిద్దేశ్వర స్వామి కళ్యాణమహోత్సవం

:హావేలి ఘనపూర్ మండల పరిధిలోని ముత్తాయికోట గ్రామంలోని సిద్దేశ్వర స్వామి ఆలయాన్ని కుటుంభ సమేతంగా దర్శించుకున్న సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి గారికి స్థానిక మండల ప్రజా ప్రతినిధులు, దేవస్థాన కమిటీ నాయకులు ఘన స్వాగతం పలికారు. స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న  ఎమ్మెల్సీ గారు కల్యాణ మహోత్సవం లో ఆశీనులయ్యారు. వేద పండితుల ఆధ్వర్యంలో అంగరంగవైభవంగా జరిగిన సిద్దేశ్వర స్వామి కల్యాణం లో ఎమ్మెల్సీ గారి కుటుంబ సభ్యులతో పాటు మెదక్ పరిసర ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు. అనంతరం కళ్యాణమహోత్సవానికి హజరైన భక్తులకు ఎమ్మెల్సీ స్వంత అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గారితో పాటు ఎంపీపీ శేరి నారాయణ రెడ్డి, సర్పంచులు దేవా గౌడ్, మహిపాల్ రెడ్డి, నోముల శ్రీకాంత్ , శ్రీను నాయక్, సాయ గౌడ్,  యామి రెడ్డి, నార్ల సాయిలు, నర్సింహారెడ్డి, రాజి రెడ్డి, ఎంపీటీసీలు సిద్దిరెడ్డి, ఆలయ కమిటీ నాయకులు భిక్షపతి, శివ కుమార్, సత్యనారాయణ, పార్టీ నాయకులు గోపాల్ రావు, బాలా గౌడ్, పార్టీ యువ నాయకులు నర్సింగరావు, భాస్కర్, ప్రవీణ్, ప్రశాంత్, పాండరి, తదితరులు ఉన్నారు.