ముదిరాజులను అవమానించిన రాష్ట్ర ప్రభుత్వం.

ఆగ్రహం వ్యక్తం చేసిన నాగిరెడ్డిపేట ముదిరాజ్ సంఘం నాయకులు
నాగిరెడ్డిపేట, సెప్టెంబరు 14,(జనంసాక్షి),
ముదిరాజులను అవమానించిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఈటెల రాజేందర్ పై అసెంబ్లీ లో సస్పెన్షన్ వేటు వేయడం తెలంగాణలోని 52 లక్షల ముదిరాజ్ కుటుంబాలను అవమానపరచడమే అని నాగిరెడ్డిపేట మండల ముదిరాజ్ సంగం, సభ్యులు మరియు ప్రజా ప్రతినిధులు విమర్శించారు.బుధవారం నాగిరెడ్డిపేట మండల ముదిరాజ్ నాయకులు గంపల వెంకయ్య, వాడి నారాయణ పలువురు ముదిరాజ్ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి రాజకీయాలను శాసించే స్థితిలో ఉన్న ముదిరాజులను అవమానించ బడితే రాబోయే రోజులలో ముదిరాజుల ఆగ్రహానికి కెసిఆర్ గురికాక తప్పదని హెచ్చరిస్తున్నా ము .అసెంబ్లీ సమావేశాల  నుండి అక్రమ పద్ధతిలో ఈటల రాజేందర్ ను సస్పెండ్ చేయడం రాష్ట్ర ముదిరాజుల సమస్యలపై మాట్లాడం ఇవ్వకపోవడం అప్రజాస్వామికమని తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన జరగడంలేదని నిజం మాట్లాడే వారిని నోరు తెరచి మాట్లాడ నీవ్వకపోవడం ఇందుకు నిదర్శనమని వారు తీవ్రంగా విమర్శించారు.హుజురాబాద్ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ గెలుపు వచ్చే మునుగోడు ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుస్తుందని కెసిఆర్ కు భయం పుట్టి అందుకే ముదిరాజ్ ఎమ్మెల్యే అయినా ఎలా రాజేందర్ ను అసెంబ్లీలో నోరు విప్పకుండా సస్పెండ్ చేశారని ముదిరాజ్ ఓట్లతో ఎన్నికల్లో గెలుపు గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని, మా ముదిరాజ్ సభలు మీ ప్రభుత్వం పతనానికి నాంది పలుకుతామని ముదిరాజ్ నాయకులు కెసిఆర్ ప్రభుత్వం పై ఘాటుగా విమర్శించారు.