ముదిరాజ్ మత్స్య కార సంఘం పోస్టర్ ను విడుదల చేసిన మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి జిల్లాఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ఆధ్వర్యంలో మత్స్యకార సంఘం పోస్టర్ విడుదల చేసిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర ములో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ మత్స్య కారులు అత్యంత వెనుకబడన, వారుగా జీవనం సాగిస్తున్నారు. అనాదిగా గత ప్రభుత్వాలు మత్స్యకారుల కు అన్యాయం చేశాయి.అని ఇప్పటికైనా విద్యా ఉద్యోగఅవకాశాల్లో మత్స్య కారుల ప్రధాన డిమాండ్ బీసీ డీ గ్రూప్ నుండి బీసీ A గ్రూప్ లో బీసీ, కార్పొరేషన్ ద్వారా ప్రక్రియ ప్రారంభించి బీసీ A లో కలపాలని,చెరువులు కుంటల పై పూర్తి హక్కులు మత్స్య సహకార సంఘాలకు ఇవ్వాలని,చెరువుల పై ఇతర కులాల పెత్తనం ఆపాలని మత్స్య శాఖకు 3000 కోట్లు కేటాయించాలని,అన్ని జిల్లా లలో పిషేరీస్ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి సొసైటీ లను ఏర్పాటు చేయాలని,మత్స్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్లు మంజూరు చేయాలనిడిమాండ్ చేశారు* మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మత్స్య కారుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.సీఎం కేసిఆర్ అధ్వర్యంలో తెలంగాణ ప్రభత్వం ఏర్పాటు చేశాక చెరువులు కుంటలు కాలువలలో నీటితో నింపడమే కాకుండా ఉచితంగా  చేప పిల్లల పంపిణీ మరియు సబ్బిడి లో పనిముట్లను అందజేశారు. మంత్రి  నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం మత్స్య సంపద, పెంపొందించడానికి కార్యక్రమాలు చేపట్టిందిని,  అన్ని సమస్యలను పరిష్కరించడానికి సీఎం దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమం లో మత్స్య కార ముదిరాజ్ సంఘం నాయకులు కాగితాల లక్ష్మీనారాయణ, కంచే రవి, పుట్టపకల మహేష్ ,శ్యామ్ ఉత్తరియా,పుట్టా బాలరాజు, బోలేమొని కృష్ణయ్య, లక్ష్మయ్య, ఎఱ్ఱమణ్యం, ఆంజనేయులు,నాయకులు జెడ్పి .చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, చైర్మన్ గట్టుయాదవ్, రమేష్ గౌడ్, బండారు కృష్ణ, ఎల్ఐసి కృష్ణ పాల్గొన్నారు.