ముద్దాపూర్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

కొండపాక (జనంసాక్షి) నవంబర్ 18 : సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ముద్దాపూర్ గ్రామంలో తెరాస నాయకులు తుం శ్రీకాంత్ ఆధ్వర్యంలో శుక్రవారం సీసీ రోడ్ల నిర్మాణానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ ర్యాగల సుగుణా-దుర్గయ్య, ఎంపీటీసీల ఫొరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, ఈజీఎస్ రాష్ట్ర సభ్యురాలు కోల సద్గుణ-రవీందర్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్, పీఏసీఎస్ వైస్ ప్రెసిడెంట్ పిష్క అమరేందర్ , బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు కందూరి ఐలయ్య, లు హాజరై కొబ్బరికాయ కొట్టి సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు  రిప్పల  స్వామి, పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.