మునగాల మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడిగా జిల్లేపల్లి శ్రీనివాస్ ఎన్నిక
మునగాల, అక్టోబర్ 20(జనంసాక్షి): మునగాల మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడిగా జిల్లేపల్లి శ్రీనివాసును ఎంపిక చేసిన జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బైరు శైలేందర్ గౌడ్ గురువారం మునగాల మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియామక పత్రాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లేపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో మండల మండల బాధ్యతలు అప్ప చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మండలంలో కాంగ్రెస్ పార్టీ కొరకు నిరంతరం శ్రమిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మునగాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల జైపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలిశెట్టి బుచ్చిపాపయ్య, మండల ప్రధాన కార్యదర్శి మండవ చంద్రయ్య, జిల్లా కార్యదర్శి కాసర్ల కోటేశ్వరరావు, జిల్లా ఐఎన్టియూసి జనరల్ సెక్రటరీ హరిబాబు, వినయ్ తదితరులు పాల్గొన్నారు.