మునిగాల సాయమ్మ భౌతికయానికి పూలమాల వేసి నివాళులర్పించిన కుడుముల
మంగపేట,సెప్టెంబర్ 28 (జనంసాక్షి):-
మంగపేట మండలం కొత్త మల్లూరు గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటి అధ్యక్షులు మునిగాల సాంబులు నాయనమ్మ అయిన మునిగాల సాయమ్మా తెల్లవారు జామున అనారోగ్యంతో మృతి చెందగా ఆ విషయం తెలుసుకున్న సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ, సర్పంచ్ కుడుముల లక్ష్మీనారాయణ వారి ఇంటి దగ్గరికి వెళ్లి భౌతికయానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఈ కార్యక్రమంలో కొత్తమల్లుర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు మునిగాల సాంబులు,మండల యూత్ నాయకులు గుండారాపు రమేష్,మునిగాల నరేష్, గుండారాపు శ్రీను, మండల సోషల్ మీడియా ఇన్చార్జి గుడివాడ శ్రీహరి,బట్ట సతీష్,బట్ట శ్రీను, తదితరులు పాల్గొన్నారు.