మునుగోడులో గొల్ల కురుమల భారీ ధర్నా

*నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం
మునుగోడు అక్టోబర్20(జనంసాక్షి):
బిజెపి వైఖరికి నిరసనగా మునుగోడులో గొల్ల కురుమల భారీ ధర్నా నిర్వహించి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.గురువారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్ ఆధ్వర్యంలో దర్వా నిర్వహించి బిజెపి ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన అనంతరం వారు మాట్లాడుతూ గొల్ల కురుమల గొర్రెల పంపిణీ పథకం ద్వారా లబ్ధిదారులకు డబ్బులు అకౌంట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం జమ చేసింది కానీ బిజెపి నీచ రాజకీయ బుద్ధితో గొల్ల కురుమలను డబ్బులు విత్ డ్రా చేసుకోవద్దని బిజెపి పార్టీ ఎలక్షన్ కమిషన్ కమిషన్ నోటీసులు ఇవ్వడంతో గొల్ల కురుమలు అసంతృప్తి చెందారని,కులవృత్తులకు రాష్ట్రసర్కారు ఊతమిస్తున్నది.గొల్ల కురుమల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది.జీవనోపాధి కల్పించేలా చేయూతనందిస్తూ ఎలమంద మురిసేలా ఆర్థికంగా ఆదుకుంటున్నది.దేశంలో ఎక్కడా లేని విధంగా సబ్సిడీ గొర్రెల పథకానికి శ్రీకారం చుట్టి గొల్ల కురుమలను సొంత కాళ్లపై నిలబెడుతున్నది.సర్కారు తోడుతో 75శాతం సబ్సిడీతో గొర్రెల యూనిట్‌ ఇవ్వడంతో పాటు జీవాలకు ఇన్సూరెన్స్‌,రవాణా,ఫీడింగ్‌ సౌకర్యాలు కూడా కల్పిస్తున్నది.మరోవైపు ధరలుపెరిగిపోతుండడంతో యూనిట్‌ ఖర్చును రూ.1.75లక్షలకు పెంచింది. మునుగోడు నియోజకవర్గంలో రెండు విడుతల్లో కలిపి 12,611 యూనిట్లు అందించింది.ఈక్రమంలో తమను ఆదుకున్న కారు పార్టీకే మునుగోడు ఎన్నికల్లో తమ మద్దతు ఉంటుందని గొల్లకురుమలు తెలియజేస్తున్నారు.ఈకార్యక్రమంలో యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు మరియు గొల్ల కురుమల నాయకులు పాల్గొని విజయవంతం చేశారు.