మునుగోడు ఉప ఎన్నిక ఖాయం

తెలంగాణ రాజకీయాల్లో మార్పు రావాలి
రాజగోపాల్‌రెడ్డితో ఉత్తమ్‌, వంశీచంద్‌ చర్చలు
కాంగ్రెస్‌ పార్టీని వీడొద్దంటూ సూచన
రాహుల్‌ దూతలుగా చర్చలు..ఢల్లీికి రావాలని ఒత్తిడి
తన పోరాటం కెసిఆర్‌పైనే అంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యలు

హైదరాబాద్‌,జూలై30(జనంసాక్షి): తెలంగాణ కాంగ్రెస్‌ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో ఉప ఎన్నిక ఖాయమంటూ ఆయన వ్యాఖ్యా నించారు. శనివారం సీనియర్‌ నేత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పార్టీ ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి తో భేటీ అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. మునుగోడు ప్రజలు భావిస్తే ఉపఎన్నిక వస్తుందని అన్నారు. మునుగోడు ఉపఎన్నికపై తెలంగాణవ్యాప్తంగా చర్చ జరగాలి. మునుగోడు తీర్పు తెలంగాణలో మార్పున కు నాంది కావాలి. ఆ ఉప ఎన్నికతో తెలంగాణలో తప్పక మార్పు వస్తుంది. నేను కేసీఆర్‌పై ధర్మ యుద్ధం చేస్తున్నా అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. ఉత్తమ్‌, వంశీచంద్‌రెడ్డిలతో ఢల్లీి రావాలంటూ కాంగ్రెస్‌ కీలక నేత రాహుల్‌ గాంధీ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కబురు పంపినట్లు సమాచారం. అయితే.. కోమటిరెడ్డి మాత్రం అందుకు సుముఖంగా లేనట్లు ఆయన మాటల్ని బట్టి తెలుస్తోంది. మరోవైపు ఆదివారం నుంచి ఆయన తన నియోజకవర్గంలో పర్యటించ నున్నారు. నిజయోకవర్గంలో పర్యటించిన తర్వాతే ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై ఆయన ఒక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఇదే సందర్భంలో ఉత్తమ్‌,వంశీచంద్‌లతో చర్చలు పెద్దగా ఫలించలేదని సమాచారం.
ఈ క్రమంలోనే మునుగోడుకు ఉప ఎన్నిక రావడం పక్కా అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సంకేతాలిచ్చారు. కాంగ్రెస్‌ నేతలు మాట్లాడి వెళ్ళిన తరవాత మునుగోడు ప్రజలు నిర్ణయించిన తర్వాత యుద్ధం ప్రకటిస్తానని స్పష్టం చేశారు. కేసీఆర్‌ కోరుకుంటే కాదు.. మునుగోడు ప్రజలు కోరుకుంటే ఉప ఎన్నిక వస్తదని రాజగోపాల్‌ అన్నారు.. కేసీఆర్‌ కుటుంబ పాలనకు వ్యతిరేకంగానే తన పోరాటమని చెప్పారు. అధికార టీఆర్‌ఎస్‌ నేతలు ప్రతిపక్ష ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారని రాజగోపాల్‌ మండిపడ్డారు. తాను చేయబోయే యుద్ధం పార్టీల మధ్య కాదని, ప్రజలు కేసీఆర్‌కు మధ్య జరిగే యుద్ధమని అన్నారు. మునుగోడు ప్రజలు నిర్ణయించిన తర్వాతే యుద్ధం ప్రకటిస్తానని స్పష్టం చేశారు. అభివృద్ధి కేవలం సిరిసిల్ల, సిద్ధిపేటకే పరిమితమైందన్న రాజగోపాల్‌.. హుజూరాబాద్‌లో పోయిన పరువును ప్రలోభాలతో కాపాడుకోవాలని కేసీఆర్‌ చూస్తున్నారని ఆరోపించారు. ఉప ఎన్నిక వస్తే తెలంగాణ రాజకీయాలు మారిపోతాయని అన్నారు. ఇదిలా ఉంటే కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డితో కాంగ్రెస్‌ నేతల చర్చలు విఫలమయ్యాయి. ఏఐసీసీ దూతలుగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, వంశీచంద్‌ రెడ్డిలు రాజగోపాల్‌ రెడ్డితో భేటీ అయినా ఫలితం లేకుండా పోయింది. రాహుల్‌ మాటగా ఢల్లీి రావాలని, పార్టీ మార్పుపై తొందరపాటు నిర్ణయంతీసుకోవద్దని ఇరువురు నేతలు కోరినట్లు తెలుస్తోంది. అయితే వారి విజ్ఞప్తిని రాజగోపాల్‌ తోసిపుచ్చినట్లు సమాచారం. అవసరముంటే తన వద్దకే వచ్చి మాట్లాడాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఏఐసీసీ దూతలుగా వచ్చిన ఉత్తమ్‌, వంశీచంద్‌లు నిరాశతో వెనుదిరిగినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ని పార్టీ సీనియర్‌ నేతలు బుజ్జగించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ఉదయం
రాజగోపాల్‌తో ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్‌ రెడ్డి చర్చలు జరిపారు. అనంతరం వంశీ చంద్‌ విూడియాతో మాట్లాడుతూ… రాజగోపాల్‌ రెడ్డి కరుడుగట్టిన కాంగ్రెస్‌ వాది అని చెప్పుకొచ్చారు. రాజగోపాల్‌ రెడ్డి పార్టీ వీడరని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయరని స్పష్టం చేశారు. ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదన్నారు. తాను రాజగోపాల్‌ రెడ్డిని తరుచూ కలుస్తుంటానని తెలిపారు. టీఆర్‌ఎస్‌తో పోట్లాడేది కాంగ్రెస్‌ మాత్రమే అని అన్నారు. బీజేపీ నేత బండి సంజయ్‌ మాటలు ఉత్తయే అంటూ కొట్టిపారేశారు. హైదరాబాద్‌ వరదలు వచ్చినప్పుడు బండి సంజయ్‌ చేసిన వాఖ్యలే నిదర్శనమని వంశీ చంద్‌ రెడ్డి పేర్కొన్నారు.

తాజావార్తలు