మునుగోడు సభ విజయవంతం చెయ్యాలి….

-బీఎస్పీ జిల్లా ఇంఛార్జి నిర్మాల రత్నం….
జనగామ కలెక్టరేట్ సెప్టెంబర్19(జనం సాక్షి):జనగామ జిల్లా కేంద్రంలోని స్థానిక విజయ ఫంక్షన్ హాల్లో బహుజన్ సమాజ్ పార్టీ జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ జేరుపోతుల కుమార్ అధ్యక్షతన సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ జిల్లా ఇన్చార్జి నీర్మాల రత్నం హాజరై మాట్లాడుతూ బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపు మేరకు నేడు చలో మునుగోడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. జిల్లాలోని జనగామ,స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గం నాయకులకు, కార్యకర్తలకు బహుజన్ సమాజ్ పార్టీ శ్రేణులకు అభిమానులకు రెండో విడత బహుజన రాజ్యాధికార యాత్రను విజయవంతం చేయాలని కోరినారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హుజూరబాద్ ఎన్నికల సందర్భంగా దళిత బంధు, మునుగోడు ఎన్నికల సందర్భంగా గిరిజన బందు ప్రకటించడం దళితులను గిరిజనులను మోసం చేయడం తప్ప,
పూర్తి స్థాయిలో అమలు పరిచేది ఏమి లేదని, జనాభాలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీలకు నేటి వరకు రాజ్యాధికారంలో వాటలు లేవని వాపోయారు.భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తూ వస్తున్నాయని, గత 75 సంవత్సరాల నుండి తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం బిఎస్పీ తోనే సాధ్యమవుతుందని ప్రజలకు పిలుపునిచ్చినారు. ఈ కార్యక్రమంలో నాయకులు తోండురి శ్రీనివాస్, రోడ్డ సుధాకర్, గూడూరి రాజు, సంకటి బాల నర్సయ్య, చేతల అశోక్, తదితర నాయకులు పాల్గొన్నారు.