మున్నూరుకాపు పై దాడి హేయమైన చర్య…

– ఇలాంటి చర్యలకు పూనుకుంటే ప్రతిఘటనలు తప్పవు.
నిర్మల్ జిల్లా జనం సాక్షి భైంసా రూరల్ నవంబర్ 19

 

ఇటీవల నిజామాబాద్ ఎం.పీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన అరవింద్ ఇంటిపై తెరాస కార్యకర్తలు దాడికి దిగగా, దానిని ఖండిస్తూ ముధోల్ మున్నూరు కాపు సంఘం నాయకులు భైంసా పట్టణంలోని కిసాన్ గల్లి మున్నూరుకాపు సంఘం లో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మున్నూరు కాపు పెద్దలు మాట్లాడుతూ… మున్నూరు కాపులపై దాడులు హేయమైన చర్యఅని, మరలా ఇలాంటి దాడులకు దిగబడితే తీవ్రమైన ప్రతిఘటన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో మున్నూరు కాపులు ఎదుగుదల చూసి, రాజకీయంగా ఆర్థికంగా బలహీన పరచాలని కోణంలో మున్నూరు కాపు నాయకుల పై ఈడీ దాడులు, భౌతిక దాడులు పాల్పడుతున్నారని అన్నారు. ఎంపీ అరవిందుపై దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే మున్నూరు కాపులు ఉద్యమ రూపం దాల్చాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముధోల్ తాలుకా మున్నూరు కాపు అధ్యక్షులు,ఉపాధ్యక్షులు, కార్యదర్శి,కోశాధికారి, మున్నూరు కాపు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.