*మున్సిపల్ ఆధ్వర్యంలో తడి చెత్త పొడి చెత్త గురించి ప్రజలకు, విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు*

మెట్పల్లి టౌన్ ,అక్టోబర్ 20,
జనంసాక్షి
మెట్ పల్లి పట్టణంలోని గోల్ హనుమాన్ దుబ్బవాడ
సూర్యోదయ హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థినిలకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా అన్ని వార్డులో తిరిగే చెత్త సేకరణ ఆటో లో వేయాలని ప్రజలకు అవగాహన కల్పించాలనే ఆదేశాల ప్రకారము గురువారం రోజున పురపాలక సంఘం ఆధ్వర్యంలో వార్డు ప్రజలకు అవగాహన కల్పించడం కోసం కార్యక్రమం నిర్వహించటం జరిగినది,
దీనిలో భాగంగా ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్ పర్సన్ రానావేణి సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు, మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య ,కౌన్సిలర్ చర్ల పెళ్లి లక్ష్మీ రాజేశ్వర్ గౌడ్ ,భీమనాతి భవాని సత్యనారాయణ గార్లు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.
మున్సిపల్ చైర్మన్ రానావేణి సుజాత సత్య నారాయణ గారు మాట్లాడుతూ చెత్త సేకరణ ఆటోలో మహిళలు తప్పకుండా ఆకుపచ్చ చెత్త డబ్బాలో తడి చెత్త
నీలం రంగు డబ్బాలో పొడి చెత్త
వేసి మున్సిపల్ కార్మిక సిబ్బందికి సహకారం అందించాలని అన్నారు,ఇందులో భాగంగా
మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య మాట్లాడుతూ వార్డులో ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరూ తడి చెత్త పొడి చెత్త వేరు వేరు చేసి మున్సిపల్ కార్మికులకు అందించి వారికి సహకరించాలని దీని ద్వారా ప్రజలకు అనారోగ్యాలు బారిన పడకుండా ఉంటారని అదే విధంగా ఇప్పటి వాతావరణ పరిస్థితులు డెంగ్యూ, విష జ్వరాలు ప్రభలుతున్న నేపథ్యంలో
మున్సిపల్ లోని 17,18,19,21,26 వార్డుల ప్రజలు మరియు సూర్యోదయ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థుల కు విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా విద్యార్థులు మీ కుటుంబ సభ్యులతో ఈ తడి చెత్త పొడి చెత్త గురించి అవగాహన కల్పించే బాధ్యత మీలో ఉందని మీరు తప్పకుండా ఎవరి ఇంటిలో వారి కుటుంబ సభ్యులకు తప్పకుండా తడి చెత్త పొడి చెత్త వేరువేరు చేయాలని చెప్పి పరిశుభ్రమైన మెట్ పల్లి మున్సిపల్ గా ఆరోగ్యవంతమైన మెట్ పల్లి ప్రాంతంగా ఉత్తమ మున్సిపాలిటీగా పేరు తేవడానికి మీ సహకారం కావాలని అలాగే పట్టణ వాసుల సహకారం కావాలని వారి సహకారంతో మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు,
ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రానావేణి సుజాత సత్య నారాయణ , మున్సిపల్ వైస్ చైర్మన్ బోయిన్పల్లి చంద్రశేఖర రావు ,మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య కౌన్సిలర్స్ చెర్లపల్లి లక్ష్మి రాజేశ్వర్గౌడ్ భీమనాతి భవాని సత్యనారాయణ, చెట్లపల్లి మీనాగారు,ఎనుగందుల వనజ , మున్సిపల్ సానిటేషన్ ఇంచార్జి అక్షయ్ కుమార్, ఆర్పీలు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.