*ముమ్మరంగా కొనసాగుతున్న హనుమాన్ ఆలయ పునర్నిర్మాణ పనులు* ‎

 నిర్మల్ బ్యూరో, జులై29,జనంసాక్షి,,,       నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్ పాత బస్తీ చౌరస్తాలో పురాతన హనుమాన్ ఆలయ నిర్మాణంలో భాగంగా పవిత్రమైన శ్రావణ శుక్రవారం మొదటి రోజున ఆలయ ముఖ ద్వారానికి కడప పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు మేడారం ప్రదీప్ మాట్లాడుతూ.. రాష్ట్ర దేవాదాయ శాఖ  మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి  నేతృత్వంలో నిర్మల్ జిల్లా  వ్యాప్తంగా 500 దేవాలయాల నిర్మాణం చేసిన ఘనత ఒక్క మంత్రి దే అని అన్నారు,. అలాగే మన గాంధీచౌక్ హనుమాన్ ఆలయ నిర్మాణానికి 30 లక్షలు కేటాయించడం జరిగిందన్నారు. పాత బస్తీ ప్రజలు ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.   మున్సిపల్ చైర్మన్   గండ్రట్ ఈశ్వర్  సహకారంతో  ఇటీవల కురిసిన    వర్షాలకు ఏర్పడిన గుంతలను మున్సిపల్ JCB సహాయంతో పూడ్చి వేయించడం జరిగిందన్నారు. నిర్మల్ పట్టణంలో TUFIDC రూ. 23.41 కోట్ల నిధులు విడుదల చేయించారని అన్నారు. ఈ నిధులతో పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పోస్ట్ ఆఫీస్ నుండి బంగల్ పెట్ వరకు బిటి రోడ్డు త్వరలో వేయించి నిర్మల్ పట్టణాన్ని అభివృద్ధి చేయించడం  జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయుడి రాజేందర్, కనపర్తి విజ్ఞేష్, రాజు, రవి, వినీష్, డాక్టర్    రవి, చంద్రకాంత్ రావు వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Attachments area

తాజావార్తలు