ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు.
నెన్నెల, అక్టోబర్15 (జనంసాక్షి)
నెన్నెల మండల కేంద్రంలో శనివారం పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రదాన వీధుల్లోని డ్రైనేజీల్లో పూడికతీత పనులు చేపట్టారు. వర్షాకాలం ప్రారంభం నుంచి ప్రతిరోజూ వర్షాలు కురవడంతో పూడికతీత పనులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. మండలంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పారిశుద్ధ్య పనులు సర్పంచ్ తోట సుజాత శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టారు. పంచాయతీ కార్యదర్శి సాగర్ పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు.