డ్రైనేజీ లేక రోడ్లపై నీరుపారుతున్నా పట్టించుకోని వైన్యం…
– తీవ్ర ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు..
గద్వాల రూరల్ 24 (జనంసాక్షి):-గద్వాల జిల్లా ధరూర్ మండల పరిధిలోని ద్యాగదొడ్డి గ్రామంలో మురుగు నీటి సమస్యలతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మించిన సీసీరోడ్ల నిర్మాణం చేయగా డ్రైనేజీ లేక మురుగునీరంతా రోడ్లపైకి చేరి రహదారి వెంట వచ్చే మొత్తం మురుగుగా మారి వాహన రాకపోకలకు,పాదాచారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మురుగునీరంతా ఇండ్లముందుకు చేరడంతో దోమల బెడద ఎక్కువైంది. ఈ క్రమంలోనే కాలనీలో విషపురుగులు రావడంతో కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు ఆవేదన వ్యక్తంచేశారు.
-రోడ్లపై మురుగునీరు లేకుండా చూడాలి….
గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీరోడ్ల నిర్మాణం పూర్తి చేశాక అట్టి సీసీరోడ్లపై మట్టి వేశారు. డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగు నీరంతా రోడ్లపైకి చేరి రహదారుల పొడవున పారుతుంది. మురుగునీరు పారకుండా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి మురుగు నీటిని కట్టడి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు
-దోమలబెడద ఎక్కువగా ఉంది…
ధ్యాగదొడ్డి గ్రామంలో ఎస్సీ కాలనీలో మిషన్ భగీరథ మంచినీరు నళ్ళాల ద్వారా నీరుమొత్తం రోడ్లపైకి చేరడంతో దోమలబెడద ఎక్కువై మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. దీంతో గ్రామంలో దోమలబెడద ఎక్కువైందని దీంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందన్నారు…
-గ్రామంలో వీధి లైట్లు ఏర్పాటు చేయాలి…
ఎస్సీ కాలనీలో ఇప్పటివరకు వీధి లైట్లు ఏర్పాటు చేయలేదు. చాలారోజుల నుండి కాలనీ మొత్తం అంధకారంలో ఉంది. వెంటనే గ్రామంలో వీధిలైట్లు లేనిచోట వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరారు..