ములుగు సబ్‌ రిజిస్ట్రార్‌ ఫిర్యాదు

ఇద్దరు ఎలక్టాన్రిక్‌ విూడియా విలేకర్లపై కేసు

జయశంకర్‌ భూపాలపల్లి,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): సబ్‌రిజిస్ట్రార్‌ను బెదరించడంతో పాటు బ్లాక్‌మెయిల్‌ చేసిన కేసులో ములుగు కేంద్రంగా పనిచేస్తున్న ఇరువురు ఎలక్టాన్రిక్‌ విూడియా రిపోర్టర్‌లపై నాలుగు సెక్షన్‌లకింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై బండారి రాజు తెలిపారు. డబ్బులకోసం తనను బెదిరించడంతోపాటు తన కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించారంటూ ములుగు సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమ్‌ మహ్మద్‌ ఇచ్చిన ఫిర్యాదుమేరకు రిపోర్టర్‌లు రిజ్వాన్‌పాషా, రామ్మూర్తిపై 190, 228, 504, 34సెక్షన్‌ల కిందకేసులు నమోదుచేశామని వెల్లడించారు. ఆగస్టు 28వ తేదీన తాను లేని సమయంలో కార్యాలయానికి వచ్చి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారని తస్లీమ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. తాను కార్యాలయానికి వస్తున్న క్రమంలో వెనుకనుంచి వీడియో తీశారని, ఇదేమని ప్రశ్నిస్తే అసభ్య పదజాలంతో ధూషించారని తెలిపారన్నారు. గతంలో కూడా వీరు తనను బెదిరించినట్లు ఫిర్యాదులో తెలిపారన్నారు. ఈమేరకు ములుగు జూనియర్‌ సివిల్‌ కోర్టు మెజిస్టేట్ర్‌ అనుమతితో ఇరువురు విలేకరులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజు చెప్పారు.

——-