మువ్వన్నెల జెండా మెరిసిన వేళ, ఉప్పొంగిన ఉత్సాహంతో ఫ్రీడమ్ ర్యాలీ
– పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు
చండ్రుగొండ జనం సాక్షి (ఆగస్టు 13) : 75ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సమైక్య భావంతో దేశభక్తిని చాటుతున్నాయి. ఈ సందర్బంగా జరుపుతున్న వజ్రోత్సవాల లో భాగంగా శనివారం మండల కేంద్రంలో భారీ ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయ సమీపం నుండి బస్టాండ్ సెంటర్ వరకు దేశభక్తి నినాదాలు చేస్తూ సాగిన ర్యాలీలో మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. సమైక్య భావం చాటిన ఫ్రీడం ర్యాలీలో తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీవో అన్నపూర్ణ, ఎంపీపీ పార్వతి ఎం ఈ ఓ సత్యనారాయణ, ఎస్ఐ విజయలక్ష్మి పోలీస్ సిబ్బంది పాఠశాలల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులు విద్యార్థులు భారీగా పాల్గొన్నారు.