ముస్తాబౌతున్న పరేడ్ గ్రౌండ్..
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబవుతోంది. ఈనెల 27వ తేదీన పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు దాదాపు పది లక్షల మంది ప్రజలు వస్తారని టిఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. బహిరంగ సభ జరిగే ప్రదేశాన్ని ఆదివారం మంత్రులు పర్యవేక్షించి ఏర్పాట్లను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న టీఆర్ఎస్ బహిరంగసభకు పార్కింగ్ ఏర్పాట్లను పకడ్బందిగా చేస్తున్నామని హోంమంత్రి నర్సింహారెడ్డి అన్నారు. అన్ని జిల్లాల నుంచి సుమారు 10 లక్షల మంది ప్రజలు సభకు తరలి వస్తారని చెప్పారు.