ముస్లింలకు మైనారిటీ బంధు,12 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి

చింతలపాలెం  జనంసాక్షి
సూర్యాపేట జిల్లా,చింతలపాలెం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ నిరుపేద ముస్లింకు మైనారిటీ బంధు పథకాన్ని ప్రకటించి ముస్లింలను ఆదుకోవాలని ముస్లిం మైనారిటీ సంఘం నాయకుడు షేక్ జియాలుద్దీన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలలో ఎక్కువ శాతం ప్రతిరోజు కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.పట్టణాల్లో రోడ్ల వెంట చిన్న తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో ముస్లిం కుటుంబాలు బ్రతుకులు నెట్టుకొస్తున్నారు.అనేకమంది ముస్లిం యువకులు డిగ్రీ పట్టాలు పొంది ఎటువంటి ఉద్యోగాలు లేక ఇతర చిన్న చిన్న వ్యాపారుల వైపు మళ్లీ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు.ఇటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితులకు దళిత బంధు,గిరిజనులకు గిరిజన బంధు అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు కూడా మైనారిటీ బంధు పథకాన్ని తీసుకుని వచ్చి నిరుపేద ముస్లిం కుటుంబాలకు మైనారిటీ బంధు ద్వారా 10 లక్షల రూపాయలు అందించి ఆర్థిక తోడ్పాటుకు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మైనార్టీ బందు ద్వారా అనేక ముస్లిం కుటుంబాలు వారి యొక్క జీవన విధానాలు మెరుగుపడతాయని,సొసైటీలో ఒకరిపై ఆధారపడకుండా స్వతహాగా జీవించడానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అంతేకాకుండా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ఇచ్చిన హామీని కేసీఆర్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు.
Attachments area