ముస్లింలపై వివక్ష తగదు
– ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మాక్ జుకర్ బర్గ్
వాషింగ్టన్,డిసెంబర్ 10(జనంసాక్షి):ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ ముస్లింలకు బాసటగా నిలిచారు. అమెరికాలోకి రాకుండా ముస్లింలను బ్యాన్ చేయాలని రిపబ్లికన్
పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో జుకర్ బర్గ్ ముస్లింలకు మద్దతు ప్రకటించాడు. ఎవరో పాల్పడిన చర్యలకు ముస్లింలు అందరు బాధపడాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. పారిస్ దాడులు, ఇతర ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ముస్లింలపై వివక్ష చూపించడం సరికాదన్న జుకర్ బర్గ్ తన ఫేస్‌బుక్ పేజీలో ‘ఒక జ్యూ
మతస్తుడిగా నీ పైనే కాకుండా ఏ మతంపై దాడి జరిగినా ఎదురు నిలవాలని నా తల్లిదండ్రులు చెప్పారు’ అని వెల్లడించాడు. అలాగే ఫేస్‌బుక్ అధినేతగా ముస్లింలను వారి
హక్కుల కోసం, శాంతియుతమైన, వివక్ష రహిత వాతావరణం కోసం పోరాడటానికి ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు.