ముస్లింలు, బీసీలు కలిస్తే రాజ్యాధికారం కైవసం

మేధావుల సదస్సులో వక్తలు
కరీంనగర్‌, జూలై 8 (జనంసాక్షి) : బలహీన వర్గాలు రాజకీయంగా వెనుబడుతూ, అగ్ర కులాల ఆధిపత్యాన్ని సహించడం వల్లనే అన్ని రంగాల్లో వెనుకబడుతున్నారని, ఇకనైన బీసీలు, ముస్లింలు మేల్కో వాలని పలువురు వక్తలు మేధావుల సదస్సులో అభిప్రాయపడ్డారు. ఆదివారం నగరంలోని హైటెక్‌ ఫంక్షన్‌ హాల్లో డాక్టర్‌ వినయ్‌ కుమార్‌ అధ్యక్షతలన జరిగిన ఈ సదస్సులో పలు యూని వర్శిటీల ప్రొఫెసర్లు, పత్రికల సంపాదలకులు, మేధావులు హాజరై బీసీలు, ముస్లింల సమ స్యలపై తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారత రాజ్యాంగం సామాజిక న్యాయం అందరికీ కల్పించాలని తెలుపుతున్నా, అది అమలుకు నోచుకోవడం లేదన్నా రు. దీనికి అగ్రకులాల వారే పదవుల్లో కొనసాగడమే కారణమన్నారు.
బీసీలు, ముస్లింలు రాజకీయంగా ఐక్యంగా ఉండి, తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. తాము తలుచు కుంటే రాజకీ యంగా ఎదగగలమని ముందు దృఢ నిశ్చయం ఏర్పర్చుకోవాలన్నారు. దీనికి ఉత్తర ప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు యూపీ చట్ట సభల్లో 300 మంది బ్రాహ్మణలుంటే, మం డల్‌ కమిషన్‌ వచ్చాక రాజకీయ వికేంద్రీకరణ జరిగి నేడు ఆ సంఖ్య 30 పడిపోయిందని వివరించారు. ఇది బలహీన వర్గాల పోరాట ఫలితమేనని తెలిపారు. అరవై ఏళ్లుగా కూడూ, గుడ్డ, ఉపాధి, నీళ్ల కోసం మనం ఇంకా కొట్లాడుతున్నామని, ఈ సమ స్యలన్నీ తొలిగిపోవా లంటే బీసీల, ముస్లింలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావా లన్నారు. ఇది జరగాలంటే తమలో రాజకీయ చైతన్యం రావాలని అభిలాషించారు.
2014 ఎన్నికలే కాకుండా రాబోయే ప్రతి ఎన్నికలో సంఘటితంగా ఉంటూ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి కృషి చేయాలన్నారు. అగ్రకులాలు ఇలా సంఘటితంగా ఉండడం వల్లనే ఆర్థికంగా, రాజకీయంగా పట్టు సాధిస్తున్నారని గ్రహించాలన్నారు. ఇప్పటికైనా మేల్కొని  ఓ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసు కునే కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో డాక్టర్‌ వినయ్‌ కవిద్యార్థి సంఘం ప్రెసిడెంట్‌ రాజారాం యాదవ్‌ తదితరులు పాల్గొని తమబీసీలు, ముస్లింలుడాక్టర్‌ వినయ్‌ కుమార్‌ తోపాటు సియాసత్‌ పత్రిక మేనేజింగ్‌ ఎడిటర్‌ జహీరి అలీ ఖాన్‌, గీటు రాయి పత్రిక ఎడిటర్‌ అబ్దుల్‌ హైషాహెబ్‌ లతీఫ్‌, జనంసాక్షి పత్రిక ఎడిటర్‌ ఎం.ఎం.రహమాన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అబూబకర్‌ ఖాలిద్‌, ఆయా యూనివర్శిటీల ప్రొఫెసర్లు సింహాద్రి, పి.ఎల్‌.విశ్వేశ్వర్‌రావు, మురళీ మనోహర్‌, అభిప్రాయాలను వెల్లడించారు.