ముస్లిం ఉద్యోగులు గంట ముందే ఆఫీసు వీడొచ్చు
హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల కోసం ముస్లిం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పొరుగుసేవల సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఒక గంట వెసులుబాటు కల్పించింది. రంజాన్ నెలరోజులు ప్రార్థనల కోసం గంట ముందే అంటే సాయంత్రం 4గంటలకే ప్రభుత్వ కార్యాలయాలను వీడి వెళ్లేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు మెమో 947జారీ అయినట్లు ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ షౌకత్ అలీ, ప్రధాన కార్యదర్శి మహ్మద్ అబ్ధుల్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉత్తర్వులను అనుసరించి ఆయా విభాగాల అధికారులు గంటముందే ముస్లిం ఉద్యోగులను విడిచిపెట్టి సహకరించాలని కోరారు.