ముస్లిం రిజర్వేషన్లకు కట్టుబడ్డాం
– ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ
హైదరాబాద్,నవంబర్ 11,(జనంసాక్షి): ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం మహముద్ అలీ తెలిపారు. దీనిపై సుధీర్ కమిటీ అధ్యయనం చేసిందని కమిటీ నివేదిక అందాక రిజర్వేషన్ల శాతం పెంపుపై కేంద్రంతో చర్చిస్తామన్నారు. కేంద్రంలో బీజేపీ మైనార్టీలకు వ్యతిరేకంగా ఉందని పేర్కొన్నారు. విద్యుత్‌ను ఆదా చేసేందుకు ఎల్‌ఈడీ బల్బులను సరఫరా చేస్తామని ప్రకటించారు. ఒక్కొక్క ఇంటికి 4 ఎల్‌ఈడీ బల్బులను సరఫరా చేస్తామని వెల్లడించారు. నూతన రెవెన్యూ పాలసీ తయారు చేసే పనిలో ఉన్నామని తెలిపారు. 12 అంశాలపై ఉన్నతాధికారులు, నిపుణులతో చర్చిస్తున్నామని చెప్పారు. ఎమ్మార్వోలు, ఆర్డీవోలు పని చేయకపోతే జరిమానాలు విధించేలా పాలసీ తీసుకొస్తామన్నారు.