మూడవరోజు బస్తీ సంపర్క అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న కొండేటి శ్రీధర్

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 18(జనం సాక్షి)
రాష్ట్ర ఎస్సీ మోర్చా శాఖ పిలుపుమేరకు వరంగల్ జిల్లా  ఉర్సు దళితవాడ   నాగమయ్య గుడి దళితవాడ  చిన్న ఉరుసు ప్రతాప్ నగర్ దళితవాడ లలో  ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాదాసు రాజుగారు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నల్లబెల్లి సుదర్శన్ గారి అధ్యక్షతన పోలేపాక జనార్ధన్ మేకల లింగమూర్తి గార్ల * ఆధ్వర్యంలో నిర్వహించిన బస్తి సంపర్క్ అభియాన్  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ శాసనసభ్యులు వరంగల్ జిల్లా బిజెపి అధ్యక్షులు కొండేటి శ్రీధర్ గారు, వరంగల్ తూర్పు ఇన్చార్జ్ కుసుమ సతీష్ గారు జాతీయ జనతా పార్టీ నాయకులు డాక్టర్ వన్నాల వెంకటరమణ గారు పాల్గొన్న కార్యక్రమంలో
 కొండేటి శ్రీధర్ గారు దళిత బస్తీలో ఇంటింటికి తిరుగుతూ బస్తీలోని దళిత కుటుంబాలను కలిసి వారి అభ్యున్నతి కోసం భారతీయ జనతా పార్టీ చేస్తున్న కృషిని వివరిస్తూ దళితులకు భారతీయ జనతా పార్టీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇస్తున్న ప్రాధాన్యత గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్ము గారిని భారత దేశ ప్రధమ పౌరురాలిగా ఎన్నుకోవడం ఇందుకు నిదర్శనం అన్నారు,
రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం మొదట దళితులనీ ముఖ్యమంత్రిని చేస్తామని దళితులకు డబల్ బెడ్ రూమ్ అని మూడెకరాల భూమి అని నమ్మ పలికిన కెసిఆర్ మోసం చేసి ఇప్పుడు దళిత బంధువు అనే కొత్త మోసానికి తెర తీశారని ఈ మోసపూరిత మాటలను ఇకపై నమ్మకూడదని
దళితుల ఉన్నతికై కృషి చేస్తూ,గ్రామాలకు కేంద్రం నుండి వస్తున్న నిధులను ఉపయోగించి దళిత బస్తీలను అభివృద్ధి చేయడానికి రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపాలని కోరారు
అనంతరం
దళితుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జన్ను  కుమార్ జిల్లాప్రధానకార్యదర్శి చింతం భాస్కర్ .గుంటి వీర ప్రకాష్   సింగారపుసుజాత.రజిత భారతీయ జనతా పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Attachments area