మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరం కానున్న రోహిత్
విశాఖలో కివీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడ్డ టీమిండియా క్రికెటర్ రోహిత్‌శర్మకు శస్త్రచికిత్స జరగనుంది. దీంతో మూడున్నర నెలల పాట క్రికెట్‌కు దూరం కానున్నాడు. విశాఖ వన్డేలో గాయపడడంతో ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కూ రోహిత్‌ను ఎంపిక చేయలేదు సెలక్టర్లు. అయితే తాజాస్కానింగ్‌లో రోహిత్‌కు తీవ్ర గాయాలైనట్లు వెల్లడైంది. దీంతో కనీసం 10 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారు ఫిజియో థెరపిస్ట్. అవసరమైతే సర్జరీ కూడా చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా చెప్పిన రోహిత్, టీమిండియాకు ఆడాలని ఉన్నా గాయం తన ఆశలను వమ్ముచేసిందని వాపోయాడు.