మూడు బీసీ గురుకుల పాఠశాలల మంజూరు పట్ల హర్షం: బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనుంజయ నాయుడు
గరిడేపల్లి, సెప్టెంబర్ 23 (జనం సాక్షి): ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మూడు బీసీ గురుకుల పాఠశాలతో పాటు ఒక డిగ్రీ గురుకుల కళాశాలను మంజూరు చేయడం పట్ల తెలంగాణ ప్రభుత్వానికి బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు ధన్యవాదాలు తెలియజేశారు.శుక్రవారం ఆయన గరిడేపల్లి మండల కేంద్రంలో పాత్రికేయులతో మాట్లాడుతూ
బీసీ విద్యార్థినీ విద్యార్థులకు మరిన్ని విద్యా అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు కొత్తగా బీసీ గురుకులాలు గురుకుల కళాశాలను మంజూరు చేయడం హర్షించదగ్గ విషయమని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మంజూరైన కళాశాలలకు పాఠశాలకు సొంత భవనాలు లేవని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని నూతనంగా మంజూరైన గురుకులాలలో విద్యార్థుల ప్రవేశానికి ప్రక్రియను వెంటనే చేపట్టాలని బోధన సిబ్బంది నియామకాలు కూడా సాధ్యమైనంత తొందరగా పూర్తిచేయాలని ఆయన కోరారు.సూర్యాపేట జిల్లాకు మంజూరైన బీసీ గురుకుల పాఠశాలను హుజూర్ నగర్ నియోజకవర్గానికి కేటాయించి నియోజకవర్గంలో ఉన్న ఏడు మండలాల్లో ఏదో ఒక మండలంలో ఏర్పాటు చేయాలని సూర్యాపేట జిల్లాకు కూడా మరొక బీసీ గురుకుల కళాశాలను మంజూరు చేయాలని ఆయన కోరారు. ఆయన వెంట బీసీ హక్కుల సాధన సమితి నాయకులు కడియాల అప్పయ్య, తిరుపయ్య సైదులు ఉన్నారు.
Attachments area