మూడు రోజులపాటు విశేష పూజలు అందుకున్న మట్టి బొజ్జ గణపయ్య.

 

గంగమ్మ ఒడిలోకి గణనాథుడు.
తాండూరు సెప్టెంబర్ 2 (జనం సాక్షి)మూడు రోజులపాటు విశేష పూజలు అందుకున్న మట్టి బొజ్జ గణపయ్యను గంగమ్మ వాడిలోకి భక్తిశ్రద్ధల తో నిమజ్జనం చేశారు.వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ సమీపంలోని మహాత్మ జ్యోతి బాపూలే బాలుర గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ స్వప్న అద్వర్యంలో భక్తిశ్రద్ధలతో మట్టివినాయకున్ని ప్రతిష్టాపించి పూజించారు.మూడు రోజులపాటు విశేష పూజలు అందుకున్నబొజ్జగణపయ్యను శుక్రవారం యాలాల మండలం కోకట్ కాగ్నానదిలో నిమజ్ఞనంచేశారు.అంతకు ముందు గురుకుల పాఠశాల ఆవరణలో భక్తిశ్రద్ధలతో పాఠశాల ఉపాధ్యాయు లు కలిసి భజనలు సంకీర్తనలు ఆలపిస్తూ జై బోలో గణేష్ మహరాజ్ కి జై అంటూ భక్తిని చాటుకున్నారు.ఈ నిమజ్జన శోభాయాత్రలోగురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.