మూడెకరాల హావిూని అమలు చేయండి

నల్లగొండ,జూన్‌2(జ‌నం సాక్షి): దళితులకు మూడెకరాల భూమి, రెండు పడకల గదులు, రుణాలివ్వటంలో పూర్తిగా నిర్లక్ష్యం చాటుతున్నారని మాలమహానాడు నేతలు విమర్శించారు. దళిత ముఖ్యమంత్రి హావిూని విస్మరించిన సీఎం కేసీఆర్‌ ఎస్సీ వర్గీకరణపై మొగ్గు చూపటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. దళితుల అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సిన నిధులను దారి మళ్లించి మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాల పేరిట అవినీతికి పాల్పడుతున్నారని తెలంగాణ మాల మహానాడు జిల్లా నేతలు ఆరోపించారు.