మూడెకరాల హావిూని విస్మరించారు

ఖమ్మం,జూలై30(జ‌నం సాక్షి): దళితులకు మూడెరెకాల భూమి పంపిణీ చేస్తానన్న ముఖ్యమంత్రి మాటతప్పారని సీపీఎం నాయకులు విమర్శించారు. దళితులు, గిరిజనుల ఆత్మగౌరవాన్ని తెలంగాణ ప్రభుత్వం దెబ్బ తీస్తోందని భాద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. కార్పొరేట్‌ శక్తులకు ఎర్ర తివాచీ పరుస్తున్న తెరాస ప్రభుత్వం అణగారిన వర్గాల బాగను పూర్తిగా మరిచిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో బడుగు జీవుల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతామని అన్నారు. కులాలు, మతాలు, వర్గాల ప్రాతిపదికన కాకుండా జనాభా ప్రాతిపదికన తెలంగాణలో సామాజిక న్యాయం అందజేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ గిరిజనులపై అక్రమ కేసులు బనాయించి అడవులనుంచి వారిని దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. భద్రాద్రి జిల్లా దుమ్ముగుడెం వద్ద గోదావరికి లిఫ్ట్‌ ఏర్పాటుచేసి అక్కడి భూములకు నీరివ్వాలని డిమాండ్‌ చేశారు.