మూడో రోజు కొనసాగుతున్న అయుత చండీయాగం
హైదరాబాద్: మెదక్‌జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత చండీయాగం మూడో రోజుకు చేరింది. ఉదయం గురుప్రార్థన, గణపతిపూజ, ఏకదశన్యాస పూర్వక త్రిసహస్ర చండీపారాయణాలు, నవావరణ పూజ, నవగహ్ర హోమం, యోగిని బలి, రాజశ్యామల చతుర్వేద మహారుద్ర పురశ్చరణలు, దంపతీపూజ, మహా మంగళహారతి, తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు ఉంటాయి. మధ్యాహ్నం 3గంటల నుంచి ధార్మిక ప్రవచనాలు. ఆధ్యాత్మికవేత్త చిన జీయర్‌స్వామి, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, ఏపీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు, మండలి ఛైర్మన్ చక్రపాణి తదితరులు చండీయాగంలో పాల్గొనున్నారు.