మూడో రోజూ సాగిన కేజ్రివాల్‌ దీక్ష

ఇది నా సర్జికల్‌ స్టైక్ర్‌
రాష్ట్ర హక్కులను కేంద్రం కాలరాస్తోంది
తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ధర్నా ఆపం
ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌
న్యూఢిల్లీ, జూన్‌13(జ‌నం సాక్షి) :  రాష్ట్ర హక్కులను కేంద్రం కాలరోస్తోందంటూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఇంటి వద్ద సోమవారం సాయంత్రం ధర్నాకు  దిగిన ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌.. మూడో రోజు బుధవారం కూడా ధర్నాను కొనసాగించారు. తమ డిమాండ్లను అంగీకరించే వరకు ధర్నా ఆపేది లేదని బీష్మీంచుకొని కూర్చున్నారు. ప్రజలకు రేషన్‌ సరకులను డోర్‌డెలవరీ అందించే పక్రియకు ఆమోదం, నాలుగు నెలలుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న ఐఏఎస్‌ అధికారుపై చర్యలు తీసుకోవాలని, వారు సమ్మె విరమించేలా చొరవ చూపాలని డిమాండ్‌ చేశారు. కాగా తమ పోరాటాన్ని ఎప్పటికప్పుడు ఢిల్లీ ప్రజలకు ట్విటర్‌లో వీడియోల ద్వారా చేరవేస్తున్నారు. ఢిల్లీ ప్రజల హక్కులను కేంద్రం హరిస్తుందని మండిపడ్డారు. తాము 24 గంటలుగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఇంట్లో బైఠాయించినా.. తమతో మాట్లాడేందుకు ఆయన చొరవ చూపడం లేదని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజల ఆత్మ గౌరవం కోసం తాము పోరాటం చేస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా క్రేజీవాల్‌ మాట్లాడుతూ.. ‘ప్రజాసేవలను నిలిపివేసిన వారికి వ్యతిరేకంగా ఢిల్లీ ప్రజల తరఫున మేం పోరాటం చేస్తున్నామని, విూరు దీన్ని ధర్నా అనుకోవచ్చు. కానీ ఇది నా సర్జికల్‌ స్టైక్ర్‌’ అని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌ అన్నారు. సోమవారం సాయంత్రం నుంచి కేజీవ్రాల్‌, మంత్రులు సత్యేంద్ర జైన్‌, మనీశ్‌ సిసోడియా, గోపాల్‌రాయ్‌లు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. తాము చేస్తున్న ధర్నాను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మంత్రులు మండిపడుతున్నారు. తమ డిమాండ్లను కేంద్రం, ఎల్జీ ఆమోదించాలంటూ మంత్రి సత్యేంద్ర జైన్‌ సోమవారం నుంచి ఆమరణ దీక్ష చేపట్టారు. బుధవారం ఆయనకు తోడుగా మరో మంత్రి మనీశ్‌ సిసోడియా ఆమరణ దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు. ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర ¬దా ఇస్తేనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి సిసోడియా పేర్కొన్నారు. ఓ ఆంగ్ల వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఐఏఎస్‌ అధికారులు గత మూడు నెలలుగా కేవలం ఆఫీసులకు వచ్చి ్గ/ళ్లై విూద సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని.. దిల్లీలో నెలకొన్న ప్రజల సమస్యల గురించి సంబంధిత మంత్రులతో సమావేశాల్లో పాల్గొనడం లేదని ఆయన ఆరోపించారు. ఇలా చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. మూడు రాత్రులుగా నలుగురూ ఆ రూమ్‌లోని సోఫాలపైనే పడుకుంటున్నారు. భారతదేశ చరిత్రలో ఇలా ఓ గవర్నర్‌కు వ్యతిరేకంగా సీఎం ధర్నా చేయడం ఇదే తొలిసారి. ఇది ఇలాగే కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ను అడ్డం పెట్టుకొని ఢిల్లీలో కేజీవ్రాల్‌ ప్రభుత్వం సరిగా పనిచేయకుండా చేస్తున్నారని కేజీవ్రాల్‌, ఆయన మంత్రులు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే సీఎస్‌పై తాము దాడి చేశామంటూ బ్యూరోక్రాట్లు ఎవరూ సరిగా పనిచేయడం లేదని వాళ్లు చెబుతున్నారు. ఐఏఎస్‌ అధికారులందరినీ ప్రభుత్వానికి సహకరించాలని ఎల్‌జీ ఆదేశించే వరకు ఇక్కడి నుంచి కదలబోమని వాళ్లు తేల్చి చెబుతున్నారు. మూడు నెలలుగా వాళ్లు మా సమావేశాలకు రావడం లేదు. మా ఆదేశాలను పాటించడం లేదు. ఐఏఎస్‌ అధికారులు సమ్మె చేయడం ఎక్కడైనా చూశారా? ఇలాంటి కుట్రలు ఆపాలని ఎల్‌జీని కోరినా ఆయన మాత్రం తన బాస్‌ సూచనల మేరకు పనిచేస్తున్నారు. నాకు ధర్నా చేయడం తప్ప మరో దారి లేకుండా పోయింది అని కేజీవ్రాల్‌ అన్నారు. అయితే మంచి సోఫాలపై కూర్చొని ధర్నా చేస్తున్నామని, తన జీవితంలో చేసిన అత్యంత సౌకర్యవంతమైన ధర్నా ఇదే అని ఆయన జోక్‌ కూడా చేశారు. కనీసం లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ మాకు నీళ్లయినా ఇప్పిస్తున్నారు. నేను, మా మంత్రులు ఇక్కడి నుంచే పని చేస్తున్నాం అని కేజీవ్రాల్‌ చెప్పారు. తమకు లంచ్‌ బాక్స్‌లు కూడా ఇళ్ల నుంచే వస్తున్నాయని ఆయన తెలిపారు. మూడు రోజులుగా ధర్నా చేస్తున్నా అనిల్‌ బైజాల్‌ మాత్రం ఐఏఎస్‌ అధికారులకు రాతపూర్వక ఆదేశాలు జారీ చేయడానికి అంగీకరించడం లేదని వాళ్లు ఆరోపిస్తున్నారు.