మూతపడిన అన్నామలై యూనివర్శిటీ

తమిళనాడు, ఉద్యోగుల సమ్మె కారణంగా అన్నామలై విశ్వవిద్యాలయం శనివారం నిరవధికంగా మూతపడిందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాన్ను రోజుల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయని, కొత్త తేదీలను అనంతరం ప్రకటిస్తామని విశ్వవిద్యాల ఉపకులపతి రామనాథన్‌ తెలిపారు. వసతి గృహాలను వెంటనే ఖాళీ చేయాల్సిందిగా విద్యార్థులను ఆదేశించినట్లు ఉపకులపతి చెప్పారు. ఉద్యోగుల సంఖ్య, వేతనాల తగ్గింపు ప్రతిపాదనకు నిరసనగా ఉద్యోగులు నవంబర్‌ 14వ తేదీ నుంచి సమ్మెకు దిగారు. అయితే అలాంటిదేమీ లేదని రామనాథన్‌ తెలిపారు. వాటిని వదంతులుగా కొట్టిపారేశారు. అలాంఠి వదంతులు నమ్మవద్దని ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు.