మూసి కాలుష్య నీటికి వ్యతిరేకంగా సిపీఎం లక్ష ప్రజా సంతకాల సేకరణ*

*సీపీఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం*
మూసీ కాలుష్య విముక్తికై గోదావరి జలాల సాధనకై సీపీఎం చేపట్టే లక్ష సంతకాల సేకరణలో ప్రజలు భాగస్వాములు కావాలని సీపీఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం అన్నారు.సీపీఎం జిల్లా కమిటి ఆధ్వర్యంలో మూసీ ఆయకట్టులో కాలుష్య నీటికి ప్రమ్నాయంగా గోదావరి జలాలు అందివ్వాలని జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో ప్రజలతో లక్ష సంతకాల సేకరణలో భాగంగా దుబ్బాక,కక్కిరేణి గ్రామాల్లో జరిగిన కార్యక్రమంలో హాజరై మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో చేస్తున్న ప్రజా మూసీ పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రజలతో  చేయించిన సంతకాలు,మూసి కాలుష్యపు నీరు ప్యాకింగ్ చేసి దేశ ప్రధానమంత్రికి,రాష్ట్ర ముఖ్య మంత్రికి పాక్స్ పంపి ప్రజల గోడును విన్నవించనున్నామన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యుల వేముల సైదులు,మెడి గణేష్ ,ఉప సర్పంచ్ గుండాల బిక్షం, కార్యదరి కన్నెబొయిన యాదయ్య,మేడి మధు బాబు ,గట్టు మహేష్ ,జక్కుల నర్సింహ , కన్నెబోయిన బిక్షం , యాదయ్య  , లింగస్వామి నరేష్ , రాకేష్  ,కృష్ణ , జగదీష్ , లింగయ్య , నారయణ , అంజమ్మ ,రేణుక తదితులున్నారు.