మృతదేహాలతో సబ్‌స్టేషన్ ఎదుట రాస్తారోకో
ఖానాపూర్ (జనంసాక్షి): ట్రాన్స్‌కో నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు మృతి చెందారని, వారి కుటుంబాలకు 5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ అఖిలాపక్షం ఆధ్వర్యంలో ఖానాపూర్ సబ్‌స్టేషన్ ఎదుట మృతదేహాలతో ఖానాపూర్-నిర్మల్ రహదారిపై మూడు గంటల పాలు ధర్నా చేశారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పాడింది. ఖానాపూర్ తహసీల్దార్ కనకయ్య ఘటన స్థలానికి వచ్చి అఖిలాపక్షం నాయకులు, ప్రజలను సముదాయించే ప్రయత్నం చేశారు. ట్రాన్స్‌కో డీఈ వచ్చి మృతుల కుంటుబాలకు నష్టాపరిహారం ప్రకటిచే వరకు మృతదేహలను కార్యాలయం ఎదుట నుంచీ లేపేది లదని వారు భీష్మించుకూర్చున్నారు. దీంతో తహసీల్దార్ కనకయ్య నిర్మల్‌లో ఉండే ట్రాన్స్‌కో డీఈ ప్రమెద్ కుమార్‌తో మాట్లాడీ ఆయనకు ఘటన స్థలానికి రప్పించారు. తరువాత సబ్ స్టేషన్ కార్యాలయంలో అఱిల పక్షం నాయకులు, డీఈ ప్రమోద్ కుమార్, ఏఈ ప్రసాద్‌తో గంటకు పైగా చర్చలు జరాపిరు. చివరగా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఎస్‌ఈలో మాట్లాడి 1.50లక్షల పరిహారం ఇచ్చేందుకు డీఈ హమీ ఇచ్చారు. ఆపద్భంధు పథకం కింద 50 వేలు ఇప్పిస్తామని తహసీల్దారు కనకయ్య హమీ ఇచ్చారు. దీంతో అఖిల పక్షం ఆందోళన విరమించారు. మృతదేహాలను ఱానాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేయించి బందువులకు అప్పగించారు. ఆందోళనలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీరాం యాదవ్, చ్యూగెమెక్రసీ కార్యాదర్శి నందిరామయ్య , టీఆర్‌ఎస్ నాయకులు సత్యం, పుప్పాల శంకర్, గజేందర్, సత్యనారయణ, శంకర్, నందకుమార్, సతీష్, రాజేశ్వర్, టీడీపీ మండలాధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ రామునాయక్, ఆకుల వెంకాగౌడ్, మాజీ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, రాజ గంగన్న, జగన్ రావు, ప్రధీప్, కన్నయ్య, రాజు, వైఎస్సార్సీపీ నాయకులు మురళీ, రాజేష్, న్యూడెమెక్రసీ నాయకులు మాస్క దేవన్న తదితరులున్నారు.