మృతుడికి ఆర్ధిక సాయం
భువనగిరి రూరల్ జనం సాక్షి (మార్చి 7)
సోమవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బొక్క పురేందర్ రెడ్డి భౌతిగాయానికి మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు . వారి కుటుంబానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వారి కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా అన్నారు . ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పచ్చిమట్ల శివరాజ్ గౌడ్, జిట్ట బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.