మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన గ్రామ పంచాయతీ పాలకవర్గం.

దౌల్తాబాద్ అక్టోబర్ 15, జనం సాక్షి.

దౌల్తాబాద్ మండల పరిధిలో ఉప్పరపల్లి గ్రామానికి చెందిన నర్సయ్య గ్రామపంచాయతీ వాటర్ మెన్ అనారోగ్యంతో మరణించగా ఆ కుటుంబానికి ఉప్పరిపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం ఆ కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సహాయం,75 కిలోల సన్న బియ్యం అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం అందించే ఐదు లక్షల రైతు బీమాను త్వరగా అందించేలా వ్యవసాయ అధికారులతో మాట్లాడారు. మృతునికి భార్య,కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిత్తరి గౌడ్,వైస్ ఎంపీపీ అల్లి శేఖర్ రెడ్డి, ఉప సర్పంచ్,వార్డు మెంబర్స్, కో ఆప్షన్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.