మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన యువజన సేవ సభ్యులు
స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 12,(జనం సాక్షి) : మండలంలోని తాటికొండ గ్రామంలో ఇటీవల రెం డు నెలల వ్యవధిలోనే భార్య భర్తలు రోడ్డ సత్య లక్ష్మి, రోడ్డ బాబు మృతి చెందడం జరిగింది. వీరికి ఒకఅమ్మాయి,ఒకఅబ్బాయి ఉన్నారు.తాటికొండ గ్రామానికి చెందిన యువజన సేవ సంఘం సభ్యు లు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి 6850 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసారు.ఈ కార్యక్రమంలో యువజనసేవ సంఘం సభ్యులు తాటికొండ సంపత్ కుమార్ యాదవ్, నీల శ్రీను, బొల్లం నాగరాజు, లాలు రమేష్, దామె ర శ్రీను, మేకల అనిల్, ఎడమ నాగరాజు, ఐలోని శ్రవణ్, గునిగంటి శ్రీకాంత్, అక్కెనపల్లి చిరంజీవి, బలిజ రాజు, ఉబ్బని రాజు, కాసర్ల తిరుమలేష్, తదిత రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాటికొండ సంపత్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తల్లిదం డ్రులు లేని చిన్న పిల్లలకు మానవత దృక్పథంతో ఎవరికి తోచిన సహాయం వారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.