మృతుని కుటుంబానికి కిరణ్ కుమార్ గౌడ్ అండ
ధూల్మిట్ట (జనంసాక్షి) అక్టోబర్ 17 : ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన ధూల్మిట్ట మండల బెక్కల్ గ్రామానికి చెందిన గుండె మిద్దే మల్లయ్య కుటుంబాన్ని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగపూరి కిరణ్ కుమార్ గౌడ్ సూచనల మేరకు సోమవారం బొడిగే ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి, 5వేల ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతల వేణు, గుండె చంద్రయ్య, నాగపురి రవి, రావుల రాజు, నరేందర్, కిష్టయ్య,సాయికుమార్, మధు తదితరులు పాల్గొన్నారు.