మృత్యువుగా మారిన కిరోసిన్‌ దీపం

వెల్దుర్తి,మెదక్‌ : మండల కేంద్రం వెల్దుర్తిలో ప్రమాదవశాత్తు కిరోసిన్‌ దీపం పడి మంటలు అంటుకుని న్యాత యాదగిరి (40)అనే వ్యక్తి మృతి చెందాడు. కరెంట్‌ లేకపోవడంతో నిన్న రాత్రి ఇంట్లో వెలిగించిన కిరోసిన్‌ దీపాన్ని కుటుంబసభ్యులు ఆర్పివేయలేదు. దీపం బట్టలపై పడటంతో మంటలు చెలరేగి నిద్రిస్తున్న యాదగిరికి అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో అతను సజీవ దహనమయ్యాడు. కుటుంబసభ్యులు వేరే గదిలో నిద్రిస్తుండంతో ప్రమాదాన్ని వెంటనే గుర్తించలేకపోయారు