*మెట్పల్లి లో ఘనంగా బతుకమ్మ వేడుకలు ఆడి పాడిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 26 : జనం సాక్షి
తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత ఆడబిడ్డలందరికీ మన పండుగ అయిన బతుకమ్మ కాపాడుకోవాలని ఆలోచన ఏర్పడిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు జైచాల్ జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మినీ స్టేడియంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తన మనసుకు అత్యంత దగ్గరైన పండుగ బతుకమ్మ అని చెప్పారు రోజంతా పనిచేసే కష్టాలన్నీటిని మరిచిపోయి పుట్టింటికి వెళ్లి అందరితో కలిసి సంతోషంగా ఆడి పాడే పండుగ బతుకమ్మ అని అన్నారు మన చుట్టుపక్కల దొరికే పువ్వులనే దేవుడిగా కొలిచే పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు తెలంగాణలో ఎక్కడ చూసినా చెరువులు నిండుగా ఉన్నాయని ప్రతి చోట బతుకమ్మ కోసం సర్పంచులు ఇతరులు దగ్గరుండి ఏర్పాట్లు చేశారని ఈ సందర్భంగా తెలిపారు అనంతరం వందలాదిమంది ఆడబిడ్డలతో కలిసి ఆమె ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జడ్పీ చైర్మన్ దావసంత సురేష్, మెట్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ రాణవేణి సుజాత సత్యనారాయణ, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు