మెట్రో ఫెజ్ 2 కు అనుమతివ్వండి
` ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగాన్ని మంజూరు చేయండి
` మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ కు నిధులు ఇవ్వండి
` తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మికత ఆ నదితో ముడిపడిపడి ఉంది
` పెరుగుతునన్న అవసరాల దృష్ట్యా తెలంగాణకు అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలి
` సెమీ కండక్టర్ మిషన్ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు అనమతించాలి
` రీజినల్ రింగ్ రైల్… డ్రైపోర్ట్‌లు మంజూరు చేయండి
` ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి
ఢల్లీి(జనంసాక్షి): హైదరాబాద్ మహా నగరంలో మెట్రో రైలు సౌకర్యం అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి ఉద్దేశించిన హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్`ఎఎకు అనుమతించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం పదేళ్లుగా హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణపై దృష్టి సారించలేదని ప్రధానమంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. హైదరాబాద్ నగరంలో ఫేజ్`ఎఎ కింద రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కి.విూ పొడవైన అయిదు కారిడార్లను ప్రతిపాదించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఈ ప్రాజెక్టుకు వెంటనే అనుమతించాలని అభ్యర్థించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగంలో ఇప్పటికే 90 శాతం భూ సేకరణ పూర్తయినందున ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగాన్ని వెంటనే మంజూరు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఉత్తర భాగంతో పాటే దక్షిణ భాగం పూర్తయితే ఆర్‌ఆర్‌ఆర్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోగలమన్నారు. దక్షిణ భాగం భూ సేకరణకు అయ్యే వ్యయంలో 50 శాతం భరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి తెలియజేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌కు సమాంతరంగా రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టు ప్రతిపాదన ఉందని పీఎం మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఈ రీజినల్ రింగ్ రైలు పూర్తయితే తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని రైలు మార్గాలతో అనుసంధానత (కనెక్టవిటీ) సులభమవుతుందని ప్రధానమంత్రి మోదీకి సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు.. రీజినల్ రింగ్ రైలుకు అనుమతి ఇవ్వాలని పీఎంను సీఎం కోరారు. సముద్ర మార్గం లేని తెలంగాణకు వస్తువుల ఎగుమతులు, దిగుమతులు సులువుగా చేసేందుకు రీజినల్ రింగు రోడ్డు సవిూపంలో డ్రైపోర్ట్ అవసరమని, ఆ డ్రైపోర్ట్ నుంచి ఏపీలోని సముద్ర పోర్ట్ లను కలిపేందుకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు తో పాటు రోడ్డును ఆనుకొని రైలు మార్గం మంజూరు చేయాలని ప్రధానమంత్రి మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మికత మూసీ నదితో ముడిపడి ఉందని… రాజధాని హైదరాబాద్ నగరం మధ్యగా మూసీ ప్రవహిస్తోందని.. అంత ప్రాధాన్యం ఉన్న మూసీ పునరుజ్జీవనానికి సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈసా, మూసా నదుల సంగమంలో ఉన్న బాపూ ఘాట్ అభివృద్ధి, మూసీ ప్రక్షాళనకు 27 ఎస్టీపీల నిర్మాణం, మూసీ రిటైనింగ్ వాల్స్, కరకట్టల నిర్మాణం, మూసీ గోదావరి నదుల అనసంధానంతో కలిపి మొత్తంగా ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లు ఆర్థిక సహాయం అందజేయాలని ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కోరారు. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కు 222.7 ఎకరాల రక్షణ భూముల బదిలీకి సహకరించాలని పీఎంకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 61 ఐపీఎస్ కేడర్ పోస్టులు వచ్చాయని, 2015లో రివ్యూ తర్వాత మరో 15 పోస్టులు అదనంగా వచ్చాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ కేసులు పెరగడం, రాష్ట్రంలో పెరిగిన పట్టణాలు, ఇతర అవసరాల దృష్ట్యా తెలంగాణకు అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని పీఎం మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.సెవిూ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు అనువైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నందున ఇండియా సెవిూ కండక్టర్ మిషన్ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు అనమతించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నారు.
ఐదు ప్రాజెక్టులకు అనుమతులు తీసుకొస్తే కిషన్‌రెడ్డిని గండపెండేరంతో సత్కరిస్తా
` మెట్రో విస్తరణకు ఆయన మోకాలడ్డుతున్నాడు
` తనకు పేరొస్తుందనే అడ్డుపుల్లలు వేస్తున్నారు
` కాళేశ్వరంతో లింక్ ఉన్న ముగ్గురూ అనుమానాస్పద మృతి
` కేటీఆర్ వీటిపై ఎందుకు స్పందించడం లేదు?
` ఢల్లీిలో మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
న్యూఢల్లీి(జనంసాక్షి):హైదరాబాద్ మెట్రో విస్తరణ అంశం కేంద్ర కేబినెట్ ముందుకు రాకుండా కిషన్‌రెడ్డి అడ్డుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోమారు ఆరోపించారు. బుధవారం దిల్లీలో ఆయన విూడియాతో మాట్లాడుతూ వివిధ అంశాలపై స్పందించారు. ప్రధానితో భేటీ సందర్భంగా 5 ప్రధాన అంశాలపై విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్‌రోడ్ కమ్ రైలు ప్రాజెక్టు, డ్రైపోర్టు, రక్షణరంగ ప్రాజెక్టులకు సహకరించాలని కోరినట్టు తెలిపారు.‘కాళేశ్వరంపై పిటిషన్ వేసిన రాజలింగమూర్తి హత్యకు గురయ్యారు. కేసు వాదించిన సంజీవరెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందారు. కేటీఆర్ వ్యాపార భాగస్వామి కేదార్ దుబాయ్‌లో అనుమానాస్పదంగా చనిపోయారు. ర్యాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో కేదార్ కీలక నిందితుడు. ఈ అనుమానాస్పద మరణాలపై కేటీఆర్ ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. జ్యుడిషియల్ విచారణ ఎందుకు కోరట్లేదు. కాళేశ్వరం సహా ప్రాజెక్టుల అక్రమాలపై సాంకేతిక నివేదికలు రాకుండా ప్రస్తుతం ఏవిూ మాట్లాడను. ఫోన్ ట్యాపింగ్ కేసులో విదేశాల్లో ఉన్న వారిని తీసురావాల్సిన బాధ్యత ఎవరిది? త్వరలో డ్రగ్స్ కేసు విచారణకు రాబోతోంది. రాష్ట్ర విజ్ఞప్తులు ఐదింటికి కేంద్ర కేబినెట్ ఆమోదం అవసరం. కేబినెట్ ఆమోదం తేవాల్సిన బాధ్యత కిషన్‌రెడ్డి, సంజయ్‌లదే. మెట్రో విస్తరణ కేబినెట్ ముందుకు రాకుండా కిషన్‌రెడ్డి అడ్డుకున్నారు. కేంద్రానికి విజ్ఞప్తి చేసిన ఐదు ప్రాజెక్టులు సాధిస్తే కిషన్‌రెడ్డికి గండపెండేరం తొడుగుతానని అన్నారు. పదేళ్లుగా ఎస్‌ఎల్‌బీసీ పనులు జరగలేదు. కాంగ్రెస్‌కు పేరొస్తుందనే కేసీఆర్ ఎస్‌ఎల్‌బీసీ పనులు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే పనులు మళ్లీ మొదలయ్యాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు యత్నిస్తున్నాం. ప్రస్తుతం ఎస్‌ఎల్‌బీసీ వద్ద 11 సంస్థలు పనిచేస్తున్నాయి. సొరంగం వద్ద జరిగింది ప్రమాదం. కాళేశ్వరంలో జరిగింది డిజైన్, నిర్మాణ లోపంతో జరిగిన దుర్ఘటన. హైదరాబాద్‌కు మెట్రో రావడానికి ప్రధాన కారకుడు జైపాల్‌రెడ్డి. కేసీఆర్ వచ్చాక మెట్రో కోసం చేసిందేవిూ లేదు. మెట్రో విస్తరణపై కేసీఆర్ పదేళ్లు తాత్సారం చేశారని మండిపడ్డారు. ప్రతి నెలా ఒకటో తేదీకి రూ.22,500 కోట్లు అవసరం. ప్రస్తుతం ఆదాయం రూ.18,500 కోట్లు మాత్రమే ఉంది. జీతాలకు రూ.6,500 కోట్లు, వడ్డీలకు రూ.6,800 కోట్లు చెల్లిస్తున్నాం. ఆదాయం రూ.22వేల కోట్లకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం వివరించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాపార భాగస్వామి కేదార్ సెలగంశెట్టి మృతిపై అనుమానాలున్నాయని, దుబాయ్ లో ఉన్న ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరో తేలాల్సి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మృతిపై కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కేదార్ మరణంతో లింకు ఉన్న డ్రగ్స్ కేసును బయటికి తీసి విచారణ చేస్తామని సీఎం చెప్పారు. త్వరలోనే కేదార్ మృతదేహం ఇండియాకు రానుందని అన్నారు. రాష్ట్రంలో ఇటీవల మూడు అనుమానస్పద మరణాలు సంభవించాయని చెప్పారు. డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న కేదార్, కాళేశ్వరం కేసులు వాదిస్తున్న అడ్వొకేట్ సంజీవ రెడ్డి, కేసు వేసిన రాజలింగమూర్తి మృతి చెందారని, వాటిపై కేటీఆర్ న్యాయవిచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ బీజేపీ గెలుపుకోసం పనిచేస్తోందని అన్నారు. సిబీఐ కేసులు అడ్డం పెట్టుకొని బీఅరెస్ ను విలీనం చేసుకోవాలని ఆలోచనలో బీజేపీ ఉందని సీఎం చెప్పారు. ఫార్ములా ఈ, గొర్రెల పంపిణీ కేసులో కేసులో ఈడీ ఇన్వాల్వ్ అయిందని, ఎందుకు చర్యలు తీసుకోలేదని సీఎం ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు మానిటరింగ్ చేస్తోందని, విదేశాల్లో ఉన్న వారిని తీసుకు రావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని సీఎం అన్నారు. కేంద్ర మంత్రులుగా ఉన్న వారు కూడా అవగాహన లేకుండా మాట్లాడితే ఎలా.? అని అన్నారు. కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్ల పై కమిషన్ విచారణ సాగుతోందని చెప్పారు. రాత్రిరాత్రికి తాము ఎవరినీ అరెస్ట్ చేయబోమని, అది తమ విధానం కాదని సీఎం చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ కవిూషన్లు రావనే ఎస్‌ఎల్బీసీ పనులను పక్కన పెట్టారని సీఎం అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎస్‌ఎల్బీసీని 100శాతం పూర్తిచేసి తీరుతామని చెప్పారు. పెరిగిన అంచనాలతో కలిపి 5000 కోట్ల లోపే ఎస్‌ఎల్బీసీ పూర్తవుతుందని, దీని ద్వారా మూడున్నర లక్షల ఎకరాలకు నీరందుతుందని చెప్పారు. తాను ప్రధాన మంత్రికి ఐదు విజ్ఞప్తులు చేసి, వినతిపత్రాలు అందించానని, వాటికి నిధులు తీసుకొస్తే బహిరంగ సభ ఏర్పాటు చేసి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి సన్మానం చేస్తానని సీఎం చెప్పారు. ఆ క్రెడిట్ కూడా వాళ్లే తీసుకోవచ్చిన చెప్పారు. తన పాలన అద్భుతంగా ఉందని, ఎవరి ఫోన్లు వారే వింటున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వాళ్లు స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతున్నారని చెప్పారు. తన కేబినెట్ లో అనుభవజ్ఞులైన మంత్రులు ఉన్నారని, వారి శాఖలను వారే సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. కేంద్రానికి ఎంత మొత్తంలో పన్నులు కడుతున్నామో రాష్టాల్రకు అంతే వాటా రావాలని అన్నారు. ఉప ఎన్నికలు వస్తాయని కేటీఆర్ చెబుతున్నారని, ఎలా వస్తాయో తనకు అర్థం కావడం లేదని సీఎం అన్నారు. 2014 నుంచి 2014 వరకు( బీఆర్‌ఎస్ ప్రభుత్వం) ఉన్న శాసన వ్యవస్థే ఇప్పుడు కూడా ఉందని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్ట్ నర్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు. మెట్రో విస్తరణ జరిగితే తనకు పేరొస్తుందని అనుకుంటున్నారని చెప్పారు. అందుకే కేసీఆర్ హయాంలో జరగలేదు కాబట్టి ఇప్పుడు కూడా జరగొద్దని భావిస్తున్నారని అన్నారు. అందుకే కేంద్ర కేబినెట్ లో మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారని చెప్పారు.