మెట్రో సమస్యను పరిష్కరించాం
రైళ్ల పునరుద్దరణ జరిగింది: మెట్రో ఎండి
హైదరాబాద్,అక్టోబర్13(జనంసాక్షి): సాంకేతికలోపం నిలిచిపోయిన మెట్రోరైలు సర్వీసులను పునరుద్ధరించామని మెట్రోరైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి వెల్లడించారు. శనివారం ఉదయం హైదరాబాద్ మెట్రోరైలులో సాంకేతిక లోపం తలెత్తిన సంగతి తెలిసిందే. బాలానగర్ మెట్రో స్టేషన్ వద్ద మెట్రో రైలు ఆగిపోవడంతో, మియాపూర్ నుంచి అవిూర్‌పేట వైపు వచ్చే రైళ్ల రాకపోకలు స్తంభించాయి. సమాచారం తెలుసుకున్న వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. అయితే, మధ్యాహ్నం సమయానికి సమస్యను గుర్తించిన అధికారులు సర్వీసులను పునరుద్ధరించారు. విద్యుత్ తీగల మరమ్మతు వల్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. రెండు ట్రాక్‌ల్లో రైళ్ల
రాకపోకలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.