*మెట్ పల్లి మండల ఆర్ఎంపి , పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్ష కమిటీ ఎన్నికలు ఏకగ్రీవం.*
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో మండల ఆర్ఎంపి పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్ష కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి ఈ ఎన్నికలు జగిత్యాల జిల్లా ఆర్ఎంపి పి.ఎం.పి అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగాయి. మెట్ పల్లి మండల ఆర్ఎంపి , పిఎంపి నూతన అధ్యక్షులుగా బండి శంకర్ ను , ప్రధాన కార్యదర్శిగా జోగా నరసయ్య ను ,కోశాధికారిగా
చేపూరి కాషాగౌడ్ ను, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది . నూతనంగా ఎన్నికైన అధ్యక్ష ప్రధాన కార్యదర్శి మరియు కమిటీని , మెట్ పల్లి మండల ఆర్ఎంపి , పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానం చేశారు అనంతరం ఎన్నికకు సహకరించిన జిల్లా , మండల అసోసియేషన్ సభ్యులకు , నూతనంగా ఎన్నికైన కార్యవర్గ కమిటీ సభ్యులు కృతజ్ఞత అభినందనలు తెలిపారు .ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలేని రాజేశ్వర్ రెడ్డి ,జిల్లా కోశాధికారి ఆకుల నాగరాజు ,జిల్లా గౌరవ అధ్యక్షులు గాజంగి రాజా మల్లయ్య ,అబ్దుల్లా జోనల్ జాయింట్ సెక్రెటరీ ,పెంట లింబాద్రి ,నాగభూషణ్ ,శంకర్ తదితరులు పాల్గొన్నారు