Janam Sakshi - Telugu Daily News Portal > జిల్లా వార్తలు > హైదరాబాద్ > వార్తలు > మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు / Posted on May 6, 2015
మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కూకట్పల్లిలో ఆయుర్జెన్ హెర్బల్ స్టోర్లో 11 రకాల మందులను అధికారులు సీజ్ చేశారు. ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులను విక్రయిస్తుండటం, మీడియా ద్వారా వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం చట్టరిత్యా నేరమని అధికారులు చెప్పారు. అలాగే కెపిహెచ్బి కాలనీలోని లోటస్ ఆస్పత్రి మెడికల్షాపుతోపాటు.. బంజారాహిల్స్ లోని సెంచురీ ఆస్పత్రి మెడికల్ షాపుపై అధికారులు దాడులు నిర్వహించారు. పెద్ద మొత్తంలో మందులను స్వాధీనం చేసుకున్నారు.