మెడికల్ కళాశాలకు భూములు అందించిన రైతులు చర్చలకు హాజరు కావాలి.

నాగర్ కర్నూల్ అభివృద్ధికి రైతులు దోహదపడుతూ ముందుకు రావాలి. అదనపు కలెక్టర్ మోతిలాల్.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు25(జనంసాక్షి):

నాగర్ కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు తమ భూములను అందించిన 30 మంది రైతులతో చర్చించేందుకు ఈనెల 23వ, 25వ తేదీల్లో ఆహ్వానించినప్పటికీ చర్చలకు హాజరు కావడం లేదని నాగర్ కర్నూల్ జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ యస్. మోతిలాల్ పేర్కొన్నారు.
గురువారం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్, నాగర్ కర్నూల్ ఆర్ డి ఓ, ఆర్ అండ్ బి ఈ, నాగర్ కర్నూల్ తహసిల్దార్, సర్వేయర్లతో, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత రైతులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ హాజరు కాలేదని తెలిపారు.
నాగర్ కర్నూల్ అభివృద్ధికి రైతులు దోహదపడుతూ ముందుకు రావాలని కోరారు.రైతులు అధికారులతో చర్చలకు హాజరై తమ తమ అభిప్రాయాలను వెల్లడించాలని,అదనపు కలెక్టర్ యస్. మోతిలాల్ గురువారం ఒక ప్రకటనలో కోరారు.