మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి
పల్లా దేవేందర్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి పిలుపు
రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లు ఆవిష్కరణ
నల్గొండ బ్యూరో, జనం సాక్షి
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఈనెల 28వ తేదీన జరుగుతున్న తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర మూడో మహాసభలకు ఆసుపత్రి కార్మికులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ ) రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈనెల 28 తేదీన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్.ఎం. కన్వెన్షన్ హాల్ జరిగే తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర మూడో మహాసభలను విజయవంతం కాంక్షిస్తూ నేడు
దేవరకొండ ఆస్పత్రిలో వాల్ పోస్టర్స్ ను ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్ ,సూపర్వైజర్ కార్మికులు దశాబ్దాల తరబడి అరకోర వేతనాలకు పని చేస్తున్న నేటికీ క్రమబద్ధీకరణకు నోచుకోవడం లేదని ఆరోపించారు. కార్మికులు అనేక పోరాటాలు చేసి సాధించుకున్న జీవో నెంబర్ 21 అమలు కాకపోవడం చేత కార్మికులు పెద్ద ఎత్తున ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రెగ్యులర్ ఉద్యోగులకు కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులకు అమలు చేసిన పిఆర్సి జీవో నెంబర్ 60 ని ప్రస్తుతం థర్డ్ పార్టీ ఏజెన్సీల కింద ఉన్న శానిటేషన్ ,సెక్యూరిటీ గార్డ్, పేషెంట్ కేర్ కార్మికులకు కూడా వర్తింప చేసిందని దీనితో ప్రభుత్వం కార్మికుల వేతనాలను 15,600 రూపాయలకు పెంచిన క్షేత్రస్థాయిలో కార్మికులకు నేటికీ అందటము లేదని అన్నారు. రోజురోజుకు నిత్యవసర సరుకులు ధరలు పెరుగుతుంటే కార్మికుల వేతనాలు పెరగకపోవడం విచారకరమని అన్నారు. వెంటనే కొత్త వేతనాలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాధికారులను కోరారు. దేవరకొండ ఆస్పత్రిలో వంద పడకలు ఉన్నప్పటికీ కేవలం 70 పడకలకే శానిటేషన్ టెండర్ వేయడం వల్ల కార్మికుల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని , వంద పడకలకు టెండర్ మార్చి కార్మికులకు ఉపాధి కల్పించాలని దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబ్నగర్లో జరిగే మహాసభలో కార్మికుల సమస్యలపై భవిష్యత్తు ఉద్యమ కార్యచరణను రూపొందించడం జరుగుతుందని కావున కార్మికుల పెద్ద ఎత్తున పాల్గొని రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏ ఐ టీ యూ సీ డివిజన్ అద్యక్షులు నునే వెంకటేశ్వర్లు, నీల వెంకటయ్య,అలమొని మల్లయ్య, మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి వెంకటేశ్వర్లు, తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ అధ్యక్షులు జే ఆంజనేయులు, కార్యదర్శి రామేశ్వరమ్మ, చందు, లచ్చిరామ్, భద్రమ్మ ,తారమ్మ, ప్రణయ్, పద్మ ,అరుణ, శాంతి, రాణి ,సునీత, సుజాత, తదితరులు పాల్గొన్నారు.*